కరోనాతో చేనేత వ్యాపారం అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఈటీపీ ప్లాంట్ నడపడానికి నగరి ఎమ్మెల్యే రోజా బంధువులు, అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని తెదేపానేత గాలి భాను ప్రకాశ్ ఆరోపించారు. చేనేత కార్మికుల్ని ఆదుకోవాల్సింది పోయి వసూళ్లకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండి పడ్డారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈటీపీ ప్లాంట్ నడుపుతామని, అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం నుంచి భరిస్తామని ప్రకటనలు గుప్పించిన వైకాపా ఇప్పుడు చేస్తుందేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి: కుప్పం వద్ద విద్యత్ వైరు తెగి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం