చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. జిల్లాలో తాజాగా ఆదివారం 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని శ్రీకాళహస్తిలో 3 కేసులు నమోదు కాగా... నాగలాపురంలో 1 నమోదైంది. జిల్లావ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 177కి చేరుకుంది. శనివారం నమోదైన 4 కేసుల్లో1కేసు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నదిగా అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 77కాగా... ప్రస్తుతం 100 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి బస్సులు ఏర్పాటు చేయండి... ఖర్చు భరిస్తాం'