చిత్తూరులో బాలుడి కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు - boy kidnap news in tirupathi
చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్లో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కేసును తిరుపతి అర్బన్ పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 48 గంటల్లో బాలుడి ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్‌నకు సంబంధించి ప్రధాన నిందితురాలితో పాటు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. తగిన ఆధారాలతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు. కేసును ఛేదించిన సీఐ అంజు యాదవ్ బృందాన్ని ఎస్పీ ప్రశంసించారు.
రేణిగుంటలో కిడ్నాప్‌కి గురైన బాలుడిని తల్లికి అప్పగించి పోలీసులు