కరోనా బాధితులకు సేవలు అందించే విషయంలో వైద్యులు బాధ్యతాయుతంగా పని చేయాలని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శిల్పారామంలో ఆయన్ని జూనియర్ డాక్టర్లు కలిసి తమ సమస్యలను వివరించారు. కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెవిరెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు కరోనా బాధితులకు అందుతున్న సేవలపై చెవిరెడ్డి భాస్కర్‌రెడి, కలెక్టర్ భరత్‌గుప్తా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో బాధితులకు మెరుగైన వైద్యసేవలు, వైద్యం, భోజనం సదుపాయల కల్పనపై ఆరాతీశారు. జేసీ వీరబ్రహ్మం, తుడా వీసీ హరికృష్ణ, డిప్యూటీ కలెక్టర్లు కిరణ్‌కుమార్, శ్రీనివాసులు, రంగస్వామి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పనికి పంపితే గర్భవతిని చేశాడు...