ETV Bharat / state

ప్రలోభ యాత్ర.. ఏ పద్దులో చేరుతుందో.! - undefined

ఎప్పుడూ లేని విధంగా చంద్రగిరిలో కొత్త క్యాంపు రాజకీయానికి తెరలేచింది. బల నిరూపణ కోసం గెలిచిన అభ్యర్థులను ఎక్కడికైనా తరలిస్తారు. కానీ గెలిపించే ఓటర్లకూ అలాంటి టూర్స్​ ఉంటాయనడానికి చంద్రగిరి నియోజకవర్గమే ఓ ఉదాహరణ. అయితే ఓటర్ల రైలు యాత్ర కోసం చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంత ఖర్చు చేశారో తెలుసా?

ఓటర్ల షిర్డీ యాత్ర...ఏ ఖాతాలోకి వెళ్తుందో!
author img

By

Published : May 18, 2019, 11:01 AM IST

రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినా.. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోనే ఉంది. అభ్యర్థి ఇప్పుడు పెట్టే ఖర్చు ఎన్నికల వ్యయంగానే పరిగణిస్తారు. అయితే కోడ్ అమలులో ఉన్నప్పుడే.. రీపోలింగ్ జరగనున్న కేంద్రాలకు చెందిన ఓటర్లను చెవిరెడ్డి భాస్కరరెడ్డి షిర్డీ పంపారు. 21 బోగీలతో కూడిన ప్రత్యేక రైలును బుక్ చేసి సుమారు 1500 మందిని తరలించారు.

చెవిరెడ్డి భార్య పేరిట బుకింగ్..
ప్రలోభాల యాత్రకు సుమారు 28 లక్షల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తోంది. మే నెల 16 నుంచి 19 వరకూ చంద్రగిరి నుంచి షిర్డీ వెళ్లి రావడానికి వీలుగా ప్రత్యేక రైలు కేటాయించాలని కోరుతూ ఏప్రిల్‌ నెలలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్య సి.లక్ష్మి పేరుమీద ఐఆర్​సీటీసీ ఛీప్‌ జనరల్‌ మేనేజర్‌కు దరఖాస్తు చేశారు.
అధికారులు ఏప్రిల్‌ 22 తేదీన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఆర్‌సీటీసీ సీజీఎమ్‌ ఉత్తర్వుల మేరకు చీఫ్‌ ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కార్యాలయం రైలు కేటాయించారు. ఈ విషయాన్ని ఈ నెల మూడు, పద మూడు తేదీల్లో రెండుసార్లు లక్ష్మికి తెలియజేశారు. నిబంధనల మేరకు మద్యం వంటి నిషేధిత వస్తువులను రైలులో అనుమతించమని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే... షిర్డీ యాత్రలో మాత్రం మద్యం సేవించడం, పేకాట వంటి కార్యక్రమాలు యథేచ్ఛగా సాగినట్టు తెలుస్తోంది.

ఈ యాత్రను.. ఏ పద్దులో చూపుతారో?

శాసనసభ స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ముప్పై లక్షల రూపాయలకు మించి వ్యయం చేసేందుకు వీలులేదు. నామినేషన్‌ దాఖలు చేసే సమయం నుంచి పోలింగ్‌ ముగిసి.. .ప్రజాప్రతినిధిగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం తీసుకునేంత వరకూ పెట్టే ఖర్చు ఎన్నికల వ్యయంలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఏకంగా విహార యాత్ర రైలుకే దాదాపు 28 లక్షల రూపాయలు వ్యయం చేసిన చెవిరెడ్డి... ఆ మొత్తాన్ని ఏ పద్దులో చూపుతారన్నది చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి:"చంద్రగిరి" ఓటర్లు... 2014లో ఎవరి పక్షమంటే..!

New Delhi, May 17 (ANI): While addressing a press conference, Bharatiya Janata Party (BJP) president Amit Shah on Pragya Thakur's candidature is a 'satyagrah' against a fake case of fake Bhagwa terror said, "I want to ask Congress, some people were earlier arrested in 'Samjhauta Express' who were related to LeT. A fake case of "bhagwa terror" was made in which accused have been acquitted." While speaking on party's stand on Bhopal candidate Pragya Singh Thakur's controversial statement calling Nathuram Godse a 'patriot', he said, "Party has served her a show cause notice and asked her to reply within 10 days. After she files a reply, party's disciplinary committee will take appropriate actions."

For All Latest Updates

TAGGED:

chevireddy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.