గుర్తు తెలియని వ్యక్తి జలపాతంలో పడి మృతి చెందాడని నెరబైలు వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాగు ఆధారంగా మృతుడిని గుర్తించారు. శ్రీనివాస రాఘవన్ ఈ నెల ఒకటో తేదీన మధ్యాహ్నం తలకోనకు వచ్చినట్లు సీసీ టీవీ ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాళ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని, ప్రమాద విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గడ్డి ట్రాక్టర్ దగ్ధం