ETV Bharat / state

స్వర్ణ భస్మం అన్నారు... పిల్లలు పుడుతారని చెప్పారు... 25 వేలు దోచేశారు! - sanabatla cheating news

స్వర్ణభస్మం తాగితే సంతానభాగ్యం కలుగుతుందని, బెల్ట్ వాడితే ఒంట్లో వేడి తగ్గుతుందనీ.. దంపతులను మోసం చేసి 20 వేలు నగదు, సెల్ ఫోన్ కాజేశారు కేటుగాళ్ళు. మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు.

cheating
పిల్లలు పుడుతారని స్వర్ణభస్మం పేరిట మోసం
author img

By

Published : May 1, 2021, 11:48 AM IST

పిల్లలు పుడుతారని స్వర్ణభస్మం పేరిట మోసం

దంపతులు స్వర్ణభస్మం తాగితే.. పిల్లలు పుడతారని ఓ జంటను నమ్మించారు ఇద్దరు మోసగాళ్లు. కేటుగాళ్ల మాయలో పడిన దంపతులు రూ. 25 వేల నగదు చెల్లించారు. నిందితులు నగదుతో పాటు.. బాధితుల సెల్​ఫోన్​తో సహా ఉడాయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కొత్తశానంబట్లలో జరిగింది.

కొత్తశానంబట్లకు చెందిన ఈశ్వర్​రెడ్డి, భానుప్రియ దంపతులు. పెళ్లి అయ్యి ఐదేళ్లు గడుస్తున్నా.. పిల్లలు పుట్టలేదు. ఏప్రిల్ 23న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వీరి ఇంటికి వచ్చారు. తాము ఓ ఆయుర్వేదిక్ సంస్థలో పని చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. పిల్లలు పుట్టేందుకు స్వర్ణభస్మం, ఇస్తామనీ.. ఈశ్వర్​రెడ్డి పనులకు వెళ్లటం వలన ఒంట్లో వేడి ఎక్కువయ్యిందనీ, దాన్ని తగ్గించేందుకు బెల్ట్ ఇస్తామన్నారు. వీటికి రూ. 25 వేల నగదు చెల్లించాలని వివరించారు. మెుదట కేటుగాళ్ల మాట నమ్మకపోయినా.. ఈశ్వర్ రెడ్డి తల్లి చెంచమ్మ.. కోడలికి సంతానం కలుగుతారన్న ఆశతో అప్పు చేసి మరీ నగదు చెల్లించారు. ఒక్కరోజులో స్వర్ణభస్మం, బెల్ట్ తీసుకువస్తామని.. నిందితులు నగదుతో పాటు బాధితుల ఫోన్​తో పరారయ్యారు.

రోజులు గడుస్తున్నా.. నిందితులు రాకపోవటం.. వారిచ్చిన నెంబర్​కు ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటువంటి మాయమాటలు చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి: కరోనా కల్లోలం.. గరిష్ఠ స్థాయిని చేరుతున్న కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.