ETV Bharat / state

తితిదే వసతి గదుల బుకింగ్​లో స్వల్పమార్పులు - bookings

జూలై 1 నుంచి తిరుపతిలో  తితిదే వసతి గదుల బుకింగ్‌లో స్వల్పమార్పులు చోటు చేసుకోనున్నాయి

తితిదే వసతి గదుల బుకింగ్​లో స్వల్పమార్పులు
author img

By

Published : Jun 28, 2019, 4:15 PM IST

Updated : Jun 28, 2019, 5:41 PM IST

జూలై 1 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గదుల బుకింగ్‌లో స్వల్పమార్పులు చోటు చేసుకోనున్నాయి. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో గదుల బుకింగ్‌లో మార్పులు జరగనున్నాయి. భక్తుల విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరంట్‌ బుకింగ్‌లో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ భక్తులు గదులు పొందిన సమయం నుంచి 24 గంటలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది.

శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో అన్ని గదులను ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం 8 నుంచి మరుసటిరోజు ఉదయం 8 గంటల వరకు 24 గంటల స్లాట్‌ విధానం అమల్లో ఉంటుంది. బుక్‌ చేసుకున్న సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నా.. నిర్దిష్ట సమయానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే వెల్లడించింది

ఇదీ చదవండి

'ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం'

Intro:Anchor: గుంటూరు జిల్లా కారంపూడి శివారులో తెలుగుదేశం సానుభూతి పరుడి హోటల్ ను వైకాపా కార్యకర్తలు కూల్చివేశారు. కొంతకాలంగా ఉన్న పాత కక్షలు దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు అందరూ చూస్తుండగానే పొక్లిన్ తో హోటల్ ను కూల్చివేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోటల్ యజమాని షేక్ రషీద్, అతని కుటుంబ సభ్యులను నెట్టేశారు. ఘటనపై బాధితుడు రషీద్ కారంపూడి పోలీసుల్ని ఆశ్రయించారు... Vis...Body:ఘటనకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:From: p.suryarao, staff reporter
Centre: guntur
Last Updated : Jun 28, 2019, 5:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.