చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. గ్రామల్లో కట్టిన చెక్ డ్యామ్ల్లోకి నీరు రావటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణి జలాశయంలో పది అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. వర్షాలు ఇలాగే కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి.