ETV Bharat / state

అది జగనన్న వసతి దీవెన కాదు.. వంచన దీవెన: చంద్రబాబు - Chandrababu's praja chaitanya yatra at Ramakuppam

తెదేపా నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం పెట్టే కేసుల గురించి భయపడవద్దని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన.. తాము చేసేది ధర్మపోరాటమని చెప్పారు. నదులు అనుసంధానం చేసి పులివెందులకు నీళ్లిచ్చామని తెలిపారు.

Chandrababu's  praja chaitanya yatra at Ramakuppam
రామకుప్పంలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర
author img

By

Published : Feb 25, 2020, 4:19 PM IST

వైకాపా ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా పథకాల పేర్లు మార్చుకుంటారు కానీ రద్దు చేస్తారా అని నిలదీశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లె ప్రజా చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. జగనన్న వసతి దీవెన కాదు.. వంచన దీవెన అని చంద్రబాబు విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం తెదేపా చేపట్టిన ప్రాజెక్టులను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వాలని అన్నారు. కుప్పంలో ఎన్నో పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు. జె - టాక్స్​ కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

'స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల'పై హైకోర్టులో వాదనలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.