తెదేపా అధినేత చంద్రబాబు.. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ, కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా.. మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటించారు.
మూడోరోజు ఉదయం కుప్పం ఆర్అండ్బీ అతిథి గృహంలో.. పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా.. తెదేపా అధినేత.. బెంగళూరు విమానాశ్రయానికి పయనమయ్యారు.
ఇదీ చదవండి: