ETV Bharat / state

ఏపీ, తమిళనాడు సీఎస్​లకు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..! - టీడీపీ వార్తలు

Chandrababu Letter to AP and Tamil Nadu CS: కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్‌ రాళ్లను రాత్రి వేళల్లో తరలిస్తున్నారని లేఖలో ఆరోపించారు. అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు సీఎస్​కు సైతం బాబు లేఖ పంపారు.

cbn
చంద్రబాబు
author img

By

Published : Feb 7, 2023, 8:50 PM IST

Chandrababu Letter to AP and Tamilnadu CS: గత కొన్ని రోజులుగా కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది. ఇదే అంశంపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు సందర్బాల్లో పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చినా.. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై నేడు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్​తో పాటు తమిళనాడు సీఎస్​కు లేఖ రాశారు.

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడులోని క్రిష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు. శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్‌ రాళ్లను రాత్రివేళల్లో తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

చిత్తూరు జిల్లా లోని నదిమూర్, ఓ.ఎన్ కొత్తూరు, మోట్ల చేను గ్రామాల మీదుగా తమిళనాడుకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నేతల ప్రమేయంతో ఈ అక్రమ రవాణా జరుగుతోందని మండిపడ్డారు. గ్రానైట్ మాఫియా ద్వారా జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాను తక్షణమే అరికట్టాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు సీఎస్​కు సైతం చంద్రబాబు లేఖ పంపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.