చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్ కరోనా మృతి చెందడం పట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కటారి ప్రవీణ్ కుటుంబం మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రవీణ్ తండ్రి కటారి మోహన్ చిత్తూరు మేయర్గా ఉన్న సమయంలోనే హత్య చేయబడ్డారన్నారు. ఇప్పుడు కరోనాతో ప్రవీణ్ మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రవీణ్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి