ETV Bharat / state

CBN LETTER: కుప్పం దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ - TELUGU NEWS

Chandrababu letter to DGP: కుప్పంలో టీడీపీ కార్యకర్తపై దాడిని నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. టీడీపీ కార్యకర్త మురళిని అక్రమంగా నిర్బంధించి దాడి చేసినా.. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

CBN LETTER TO DGP
కుప్పం దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Dec 24, 2021, 12:08 PM IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తెలుగుదేశం కార్యకర్త మురళిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెదేపా సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ.. దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చంద్రబాబు మండిపడ్డారు.

మురళిని ఈనెల 20న అపహరించిన వైకాపా నేతలు.. రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని ఆరోపించారు.

ఇదీ చూడండి:

థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు.. బొమ్మరిల్లు మినీ థియేటర్ సీజ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.