చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెదేపా కార్యకర్త రాకేశ్ అరెస్టును పార్టీ అధినేత చంద్రబాబు ఖడించారు. అక్రమంగా రాకేశ్ పై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
గతంలో సోషల్ మీడియాలో వైకాపాపై పోస్టు పెట్టాడన్న అక్కసుతో కుట్ర పన్ని పక్క ఇంటివాళ్లతో తప్పుడు ఫిర్యాదు చేయించి రాకేశ్‍ను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తెదేపా కార్యకర్త రాకేశ్‍పై కేసులు పెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: 24 గంటల వ్యవధిలో 9,024 కరోనా కేసులు నమోదు