చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్రం బృందం గురువారం పరిశీలించింది. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల్లో పర్యటించి... పంట నష్టాన్ని అంచనా వేసింది. తుపాను కారణంగా గార్గేయ నదిపై కొట్టుకుపోయిన వంతెనలు, రహదారులను... అలాగే సదుం సోమల మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను బృంద సభ్యులు పరిశీలించారు. అనంతరం తిరుపతికి వెళ్లారు. శుక్రవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఇదీ చదవండి
అమరావతిపై రెఫరెండానికి సిద్ధం..ఓడితే రాజకీయాలకు దూరం: చంద్రబాబు