నెల రోజుల వ్యవధిలోనే ఫిర్యాదుదారులు పోగొట్టుకొన్న సుమారు 405 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ చోరీలకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. బాధితులకు ఫోన్లు అందజేశారు.
![బాధితులకు ఫోన్లు అందజేస్తున్న ఎస్పీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:45:04:1621865704_ap-tpt-17-24-cell-phones-recovery-av-ap10008_24052021194102_2405f_1621865462_974.jpg)
నేర ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషించినట్లు చెప్పారు. గతంలో ఇదే విభాగం ద్వారా రూ. 40 లక్షలు విలువైన 277 సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. దీంతో ఇప్పటివరకు సుమారు రూ. కోటి విలువైన సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వివరించారు. వీటిని ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి.. రూ. 18 లక్షల విలువైన గంజాయి పట్టివేత