తిరుమలలో మాజీ పార్లమెంటు సభ్యుడు, పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ కుమార్తె పూజ, భానుతేజ్ వివాహం తిరుమలలో అట్టహాసంగా జరిగింది. శ్రీ శృంగేరి శంకర మఠంలో జరిగిన ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, గౌనివారి శ్రీనివాసులు, మాజీ మంత్రి గీతారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సినీ నటుడు సుమన్ హాజరై నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి. భారత్ బయోటెక్ ఎండీ, జేఎండీలకు కేటీఆర్ అభినందనలు