ETV Bharat / state

'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ ! - చిత్తూరు జిల్లా నేర వార్తలు

కన్నబిడ్డల్ని కొట్టిచంపామనే బాధ లేదు..! దారుణంగా హతమార్చామనే...పశ్చాత్తాపం లేదు..! రెండ్రోజులైనా ఇంకా అదే మూఢ భక్తి.! ఇంకా చనిపోయినవాళ్లు...తిరిగివస్తారనే గుడ్డి నమ్మకం..! తానో శివుని రూపమంటూ...ఎదుటివారిని భయపెట్టేలా కేకలు..! వేరే లోకంలో ఉన్నట్లు వింత చేష్టలు..! ఆధ్యాత్మిక చింతన కాస్త..అవధులు దాటేసి కన్న కుమార్తెలను కడతేర్చే దాకా తీసుకెళ్లిందని తేలింది..! మదనపల్లె జంట హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్న బిడ్డల్ని చంపేసిన...దంపతులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మదనపల్లె జంటహత్యల కేసు
మదనపల్లె జంటహత్యల కేసు
author img

By

Published : Jan 26, 2021, 2:18 PM IST

Updated : Jan 26, 2021, 7:44 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో అక్కాచెల్లెళ్లను హత్యచేసింది తల్లిదండ్రులేనని... పోలీసులు నిర్ధరించారు. ఆదివారం రాత్రి అలేఖ్య, సాయిదివ్యను..తల్లితండ్రులు పురుషోత్తం, పద్మజ హత్యచేయడానికి తొలుత మానసిక సమస్యలే కారణంగా....పోలీసులు భావించారు. విచారణ క్రమంలో దంపతులిద్దరూ అడిగిన ప్రతిప్రశ్నకూ...ఆధ్యాత్మికకతో ముడిపెట్టేశారు. రెండ్రోజుల ప్రాథమిక విచారణ అనంతరం వారిపై...హత్యానేరం మోపి అరెస్టు చేశారు. పురుషోత్తంను ఏ1 గాను, పద్మజను ఏ2 గాను చేర్చారు. నిందితులు ఇద్దరినీ..తొలుత ఇంటి నుంచి మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

'నాకు కరోనా పరీక్షలేంటి?'

అనంతరం నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కొవిడ్ పరీక్షలు చేయించారు. పరీక్షలకు పురుషోత్తం సహకరించగా..పద్మజ మాత్రం 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?' అని ప్రశ్నించింది. 'నా గొంతులో హాలాహలం ఉంది....నన్ను అవమానించొద్దు' అని తెలిపింది. చివరకు పోలీస్ వాహనం వద్దకే వైద్యసిబ్బంది వచ్చి స్వాబ్స్ తీసుకున్నారు. పద్మజ మానసిక సమస్యతో బాధపడుతుందని సైకియాట్రిస్ట్ రాధిక తెలిపారు. పద్మజ చెబుతున్న వాటిని పురుషోత్తం అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. నిందితులను రుయా సైకియాట్రి విభాగానికి తరలించాలని ఆమె సిఫారసు చేశారు.

'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'

14 రోజుల రిమాండ్

నిందితులను తిరిగి పోలీస్ స్టేషన్ తరలించి..ఇంకొంత సమాచారం సేకరించారు. కేసులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమేనని...డీఎస్పీ రవిమనోహరాచారి స్పష్టంచేశారు. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన....సీసీ కెమెరాలతో పాటు దొరికిన ఆధారాలను పూర్తిగా విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. అలేఖ్య, సాయిదివ్య శవపపరీక్ష నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా...పద్మజ, పురుషోత్తం దంపతులకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.

ఇదీ చదవండి: గుర్తు పెట్టుకోండి.. అంధ విశ్వాసాలు మిగిల్చేది.. విషాదాలే!

Last Updated : Jan 26, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.