చిత్తూరు జిల్లా పుత్తూరులో అగ్నిప్రమాదానికి ఓ బస్సు ఆహుతైంది. పట్టణంలోని శ్రీ వెంకట పెరుమాళ్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో కళాశాలకు సంబంధించిన బస్సులతో పాటు సాయిరాం ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సులు నిలిపి ఉంచారు. శనివారం సాయంత్రం పార్కింగ్ ఆవరణలోని చెత్తను తగలబెట్టగా.. ఎగసిపడిన నిప్పురవ్వలు ప్రైవేట్ బస్సుని తాకాయి. ఫలితంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా.. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఘటనలో పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కళాశాల బస్సులకు సైతం మంటలు ఎగబాకి పాక్షికంగా దగ్ధమయ్యాయి.
ఇవీ చూడండి : 'వైకాపా పాలనలో సామాన్యుడు నిత్యావసరాలు కొనలేని దుస్థితి'