చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో సంక్రాంతి సందర్భంగా పశువులపండగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు దాదాపు 10 వేల మందికి పైగా వచ్చారు. సుమారు వెయ్యి పశువులను గుంపులు గుంపులుగా యువకుల మధ్య వదిలారు. కోడెగిత్తలను అదుపు చేసి.. వాటి కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో యువకులకు స్వల్పగాయాలయ్యాయి. గ్రామస్థులు వచ్చిన వారిని భోజన సదుపాయాలు, గాయపడిన వారి కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: