చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం, చెంచమరెడ్డి గారిపల్లిలోని చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్యాం నిండింది. చుట్టుపక్కల గ్రామాలలోని యువకులు, పిల్లలు ఈత కొట్టడానికి వెళ్తున్నారు. అలా ఈత కోసం వెళ్లిన ముగ్గురు పిల్లలలో.. పూర్ణచంద్ర (15) అనే బాలుడు ఎంతకీ రాకపోవటంతో వారు గ్రామస్థులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు లోతట్టు ప్రాంతంలో తగులుకొని ఉన్న బాలుడిని బయటకు తీశారు. బాలుడు అప్పటికేే మృతి చెందాడు. పూర్ణచంద్ర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి మద్యం మత్తులో కన్నతల్లిపై కుమారుడి దాడి