తిరుమల గురించి.. ప్రధాని మోదీ గురించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగాగా రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతలు నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీపై మంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ముందు జాగ్రత్తగా చిత్తూరు జిల్లాలో రెండో రోజు భాజపా, తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సీఎం జగన్ తిరుమల పర్యటన ముగిసేవరకు నేతలను నిర్బంధం చేసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. వారిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఇవీ చదవండి: