తితిదే ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ భాజపా ఆందోళన చేపట్టింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ముందు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. సభ్యుల సంఖ్యను 19 నుంచి 36కు పెంచుతూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, జీవో నకలు పత్రాలను దగ్ధం చేశారు. సీఎం జగన్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకులు మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి : తితిదే సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమాణం