తిరుపతిలో మీడియాతో ఎంపీ జీవీఎల్ తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, తెలుగుదేశంపై ఎలక్ట్రోరల్ సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో సెక్యులర్ ముసుగులో మత రాజకీయాలు చేస్తున్న వైకాపా, తెలుగుదేశంపై ఓటర్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఈ రెండు ప్రాంతీయ పార్టీలు... తిరుపతి ఉపఎన్నిక వేళ ప్రజలకు ఎన్నో విషయాలపై సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. కిసాన్ బిల్లులకు పార్లమెంటులో ఆమోదం తెలిపిన తెదేపా, వైకాపా.. ఇప్పుడు ద్వంద్వ ధోరణితో వ్యవహరిస్తున్నాని జీవీఎల్ మండిపడ్డారు. రైతు ఉద్యమం పేరుతో అసాంఘిక శక్తులు ఆందోళనలు జరుపుతున్నాయని ఆరోపించారు. మరోవైపు పోలీసు స్టేషన్‌లో క్రిస్మస్ వేడుకలు జరపడాన్ని జీవీఎల్ ఆక్షేపించారు. గతంలో ఎప్పుడైనా ఏ పోలీసు స్టేషన్‌లో అయినా సంక్రాంతి వేడుకలు నిర్వహించారా అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని చెప్పారు.
ఇదీ చదవండి
రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్