చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని భాజపా నేతలతో ఆ పార్టీ నేత ఆదినారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికపై వారికి దిశానిర్దేశం చేశారు. పేదల బాగోగులు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దోచుకుంటుందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నవరత్నాలు అయితే.. కేంద్రప్రభుత్వ పథకాలు 90 అని వివరించారు. వైకాపా, తెదేపాకు ఓటేస్తే కేంద్రంలో మంత్రుల చుట్టూ తిరగాలన్నారు. అదే భాజపా అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, ప్రధాన కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొన్నారు.