తితిదే ప్రచురించే సప్తగిరి ఏప్రిల్ మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించారంటూ భాజపా నాయకులు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. కోదండరామ స్వామి ఆలయం ఎదుట నిరసన చేపట్టిన భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి ఇతర భాజపా నేతలు......తక్షణమే సప్తగిరి ఎడిటర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హైందవ ధర్మపరిరక్షణ కోసం కృషి చేయాల్సిన తితిదే.....కనీసం తనిఖీలు లేకుండా వక్రభాష్యాలను ప్రచురించటం దారుణమంటూ భాజపా నాయకులు మండిపడ్డారు. చేసిన తప్పుకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేసిన భాజపా నాయకులు.....ఇందుకు ఎడిటర్‌ను బాధ్యుడిని చేస్తూ.....తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మిడతల బెడద మనకు లేనట్టే...!