రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని తిరుపతిలో భాజపా నాయకులు ఆందోళన చేశారు. తిరుపతి ఆర్టీసీ ఆర్.ఎం కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదంటూ చెప్పిన సీఎం జగన్... ఇప్పుడు మాట తప్పారంటూ విమర్శించారు. తక్షణమే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: