గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే అందించాలంటూ భాజపా నేతలు తిరుపతిలో దీక్ష నిర్వహించారు. భాజపా యువ మోర్ఛ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి దీక్షలో పాల్గొని ఇళ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తప్పు పట్టారు.
వేల సంఖ్యలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఇళ్లను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా వాడుతున్నారన్న భాజపా నేతలు...పరిస్థితులు చక్కబడిన తర్వాత... వాటిని లబ్దిదారులకు అందించాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తే....లబ్దిదారులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి