రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తూ... ప్రత్యక్షంగా 16 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని భాజపా నేతలు ఆరోపించారు. పరిశ్రమ కాలుష్యకారకంగా ఉంటే నిబంధనలు అమలు చేసేందుకు సమయం ఇవ్వాలని తెలిపారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాలుష్యం పేరు చెప్పి పరిశ్రమ తరలిపోయేలా చేస్తున్నారంటూ.. భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ అన్నారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. గడిచిన రెండేళ్ళలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేని ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలను తరలిపోయేలా చేస్తోందన్నారు. తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్నారు. కడప జిల్లాలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అధికారులు అనుమతించకపోయినా విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ మంత్రి ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: