భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్.... తిరుపతిలో భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ తరపున జనసేన నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలోని కొర్లగుంట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయన రోడ్ షో చేశారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని... ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వటం కోసం రాష్ట్ర సర్కారు ఆస్తులను విక్రయిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో పేరుకుపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే భాజపా తిరుపతి లోక్ సభస్థానాన్ని గెలవటం తప్పనిసరి అన్నారు.
ఇవీ చదవండి: