ETV Bharat / state

'దేవాలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది' - కార్వేటినగరంలో భాజపా, జనసేన నేతల ర్యాలీ

హిందువుల దేవాలయాలపై దాడులను నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో భాజపా, జనసేన నేతలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా.. ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా స్పందించకపోవడం దారుణమని నేతలు విమర్శించారు.

bjp and janasena leaders rally to protest attacks on hindu temples
భాజపా, జనసేన నేతల ర్యాలీ
author img

By

Published : Jan 6, 2021, 8:38 AM IST

హిందువుల దేవాలయాలపై దాడులను నిరసిస్తూ చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద భాజపా, జనసేన నేతలు ర్యాలీ చేశారు. దేవాలయాలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. హిందూ మతాన్ని గౌరవించి.. ఆలయాలను పరిరక్షించకపోతే ప్రభుత్వానికి పుట్టగతులుండవని భాజపా నేతలు అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రితో సహా మంత్రులు సైతం స్పందించకపోవడం దారుణమని జనసేన నేతలు విమర్శించారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేయడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని నేతలు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

వేధింపులు భరించలేక సంఘమిత్ర ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.