చిత్తూరు జిల్లా పీలేరులో తలపల,రేగళ్లు ఆరోగ్య ఉపకేంద్రాలు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీ గోడ లేదు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు ఆకతాయిలు... లోపలికి చొరబడి మల,మూత్ర విసర్జన చేస్తున్నారు. రాత్రి వేళ్లలో మందుబాబులు ఆరోగ్య ఉపకేంద్రంలో కూర్చోని మద్యం సేవిస్తున్నారు. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో ఆస్పత్రి ప్రాంగణం చెత్తాచెదారం, పిచ్చి మెుక్కలతో నిండిపోయింది. ప్రతి బుధవారం చిన్నారుల టీకాల కోసం వచ్చే తల్లిదండ్రులు ఈ దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రాంగణాన్ని శుభ్రం చేయించి ప్రహరీ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా పీలేరు ఆరోగ్య ఉప కేంద్రాలు - అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా.. పీలేరు ఆరోగ్య ఉప కేంద్రాలు
ప్రజలకు సేవలు అందించాల్సిన ఆరోగ్య ఉపకేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లా తలపల, రేగళ్లు ఆరోగ్య ఉప కేంద్రాల్లో చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.
చిత్తూరు జిల్లా పీలేరులో తలపల,రేగళ్లు ఆరోగ్య ఉపకేంద్రాలు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీ గోడ లేదు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు ఆకతాయిలు... లోపలికి చొరబడి మల,మూత్ర విసర్జన చేస్తున్నారు. రాత్రి వేళ్లలో మందుబాబులు ఆరోగ్య ఉపకేంద్రంలో కూర్చోని మద్యం సేవిస్తున్నారు. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో ఆస్పత్రి ప్రాంగణం చెత్తాచెదారం, పిచ్చి మెుక్కలతో నిండిపోయింది. ప్రతి బుధవారం చిన్నారుల టీకాల కోసం వచ్చే తల్లిదండ్రులు ఈ దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రాంగణాన్ని శుభ్రం చేయించి ప్రహరీ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి:రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు ఇలా రట్టు చేశారు
TAGGED:
పీలేరు ఆరోగ్య ఉపకేంద్రాలు