అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కంగారుకు లోనుకాకుండా విజ్ఞతతో వ్యవహరించాలని చిత్తూరు జిల్లా సహాయ అగ్నిమాపక శాఖాధికారి ఆదినారాయణరెడ్డి అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నేండ్రగుంట యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన అగ్నిమాపక, విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్తో అవగాహన కల్పించారు. పొరపాటున నీటిలో పడిపోయిన వారిని కాపాడటం.. వరదలు వంటి సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవటం వంటి అంశాలపై సూచనలు అందించారు.
ఇవీ చదవండి.. విపత్తులపై సైరన్..నేడు ప్రారంభించనున్న హోంమంత్రి