ETV Bharat / state

మద్యం చోరీ నిందితుల అరెస్టు

రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసివేయడంతో చోరీలు పెరిగిపోతున్నాయి. చిత్తూరులోని ఓ మద్యం ఫ్యాక్టరీలో చోరీకి పాల్పడిన అయిదుగురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్​కు తరలించారు.

Arrest of liquor suspects in chithoor district
మద్యం చోరీ నిందితుల అరెస్టు
author img

By

Published : Apr 30, 2020, 8:50 PM IST

చిత్తూరు తాలూకా పోలీస్​స్టేషన్ పరిధిలోని మద్యం ఫ్యాక్టరీలో చోరికి పాల్పడిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులోని మురకంబట్టు బైపాస్​రోడ్డులో ఉన్న శ్రీ కృష్ణ ఎంటర్​ప్రైజస్ లిక్కర్ ఫ్యాక్టరీని లాక్​డౌన్ కారణంగా మూసివేశారు. దీనిని ఆసరాగా చేసుకుని గత నెల 31వ తేదీన 110 మద్యం కాటన్లు దొంగతనానికి గురయ్యాయని ఫ్యాక్టరీ మేనేజర్ మనోహరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మళ్లీ ఫ్యాక్టరీలోకి దొంగతనం చేయడానికి వచ్చిన ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి మద్యం విక్రయించగా వచ్చిన 3,07,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించామని చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇదీచదవండి.

'నాటుసారా అడ్డుకట్టకు వాలంటీర్లు సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.