చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. నాగపట్ల వెస్ట్ బీట్ చీకిమానుకోన వద్ద 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లును అరెస్ట్ చేశారు. కూలీలకు నగదు అందిస్తూ స్మగ్లింగ్ సహకరిస్తున్న నిందితుడు హరిబాబు.. త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. 3 లక్షల విలువైన ఎనిమిది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు నాటు తుపాకులు, నిత్యావసర వస్తువుల స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న హరిబాబు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి..