వీర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ రాత్రికి ప్రవీణ్ కుమార్ పార్థివ దేహం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనుంది. రేణిగుంట పాత విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, భారత విమానయాన శాఖ అధికారులు నివాళులు అర్పించిన అనంతరం ప్రవీణ్ కుమార్ సొంతూరు రెడ్డివారిపల్లెకు పార్థివదేహాన్ని రోడ్డు మార్గం ద్వారా తరలిస్తారు.
బుధవారం మధ్యాహ్నం వరకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సందర్శనార్ధం ఉంచుతారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ తండ్రి ప్రతాపరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వ్యవసాయ పొలంలో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి
ప్రియురాలి శరీరాన్ని కట్టర్తో కట్ చేసి.. గోనెసంచిలో కుక్కి..!