ETV Bharat / state

అనారోగ్యంతో జవాను మృతి.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

చిత్తూరు జిల్లా గడ్డ కిందపల్లి గ్రామానికి చెందిన జవాను జమ్మూకశ్మీర్​లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు దిగ్భాంతికి గురయ్యారు. సంక్రాంతికి ఇంటికి వస్తాడనుకున్న జవాను అకాస్మాత్తు మరణించడంతో వారు విలపిస్తున్నారు.

jawan family
శోకసంద్రంలో జవాన్​ కుటుంబసభ్యులు
author img

By

Published : Jan 3, 2021, 7:44 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గడ్డ కిందపల్లి గ్రామానికి చెందిన జవాను మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామానికి చెందిన రెడ్డప్ప నాయుడు - శాంతమ్మల పెద్ద కుమారుడు రెడ్డప్ప నాయుడు 19 సంవత్సరాల నుంచి ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే పదోన్నతి పొందడంతో కుటుంబ సభ్యులు ఆనందా ఉన్నారు. కానీ శనివారం రాత్రి సైనిక విధులు నిర్వహిస్తూ రెడ్డప్ప నాయుడు అనారోగ్యంతో మృతి చెందాడని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారు.

జమ్మూకశ్మీర్​లో విధులు నిర్వహిస్తున్న తన భర్త చలి తీవ్రతకు అస్వస్థతకులోనై వైద్యం కోసం హెలికాప్టర్ లో వెళుతూ మృతి చెందాడంటూ భార్య కన్నీరుమున్నీరైంది. జనవరి ఒకటిన ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన భర్త.. మరో పది రోజుల్లో సంక్రాంతికి ఇంటికి వస్తాడని ఆశగా ఎదురు చూశామని తెలిపింది. ఇంతలోనే జమ్ము కశ్మీర్ నుంచి ఆర్మీ అధికారులు.. భర్త మృతి గురించి ఇచ్చిన సమాచారంతో గుండె పగిలినంత పనైందని విలపించింది. పెద్ద కుమారుడు పండక్కి వస్తాడు అనుకుంటే ఇలా జరగడంపై తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: సరిహద్దుల్లో చలి తీవ్రతకు చిత్తూరు జిల్లా జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.