ETV Bharat / state

మధ్యాహ్న భోజనంలో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర హై స్కూల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.మధ్యాహ్న భోజనాన్నిపరిశీలించారు. అవతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
author img

By

Published : Apr 18, 2019, 8:56 PM IST

పిల్లలకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంలో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిీ.ఐ అబ్బన తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు 700 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నప్పటికీ కేవలం వంద మంది విద్యార్థులకు మాత్రమే నామమాత్రంగా మధ్యాహ్నం భోజనం తయారు చేసి పూర్తి స్థాయిలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వడ్డించి నట్లుగా రికార్డు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు. భోజనం నాణ్యత సక్రమంగా లేకపోవడంతో పాటు జాబితా ప్రకారం పిల్లలకు పంపిణీ చేయకపోవడం వంటి అంశాలను గుర్తించారు. తనిఖీల అంశం ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు సీఐ వివరించారు.

శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర పాఠశాలలో తనీఖీలు చేస్తున్న విజిలెన్స్ అధికారులు

ఇవీ చదవండి

జోరు వానకు తడిసి ముద్దైన సప్తగిరులు

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బస్సు గురువారం బోల్తా పడింది. పాతపట్నం కు చెందిన విద్యార్థులతో వెళ్తున్న బస్సు కళాశాల నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లిన కొద్ది దూరం లోనే బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపాడు. బస్సులో 30 మందికి పైగా విద్యార్థులున్నారు. సంఘటన లో నలుగురు విద్యార్థినులతో పాటు ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.