దేశవ్యాప్తంగా 82వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా.. జీవనధారంగా ఉన్న అమర రాజా సంస్థను మూసి వేయాలంటూ.. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ఈ కరోనా కల్లోలంలో ఆ పరిశ్రమ యూనిట్లలో ఉపాధి పొందుతున్న 20వేల కార్మిక కుటుంబాలు నడిరోడ్డున పడేసేలా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు సీఐటీయూ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. 35ఏళ్లుగా కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి ధ్రువపత్రాలు ఇస్తున్న పరిశ్రమకు.. ఈ ఏడాది ఇలా ఆదేశాలు ఇవ్వటం కేవలం పరిశ్రమ యాజమాన్యం పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం