రబీ సీజన్లో రైతులు పండించిన వేరుశనగ విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ కొనుగోలు చేసి, ఖరీఫ్ కాలంలో రైతులకు రాయితీ ధరపై పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయ సహాయాధికారులు, ఉద్యోగులు, గ్రామవాలంటీర్ల ద్వారా వేరుశనగ పండించిన రైతుల వివరాలు సేకరించి... అధికారులే నేరుగా వారి నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లకముందు దళారీ వ్యాపారులు, ప్రైవేటు వ్యాపారులు వేరుశనగ రైతుల నుంచి కిలో రూ.50 రూపాయల నుంచి రూ.53 వరకు కొనేవారు. రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.61 వెచ్చించి కొనుగోలు చేయడంతో వేరుశనగ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీడ్స్ చిత్తూరు జిల్లా మేనేజర్ రెడ్డప్పరెడ్డి, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి ముమ్మరంగా వేరుశనగ విత్తన కాయల కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టారు.
వేరుశనగకు గిట్టుబాటు ధర... ఆనందంలో రైతులు - hgroundnut far,mers news
రైతులు పండించిన వేరుశనగ విత్తనాలను ఏపీ సీడ్స్ కొనుగోలు చేసి రైతులకు రాయితీ ధరలపై పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.61 వెచ్చించి కొనుగోలు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రబీ సీజన్లో రైతులు పండించిన వేరుశనగ విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ కొనుగోలు చేసి, ఖరీఫ్ కాలంలో రైతులకు రాయితీ ధరపై పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయ సహాయాధికారులు, ఉద్యోగులు, గ్రామవాలంటీర్ల ద్వారా వేరుశనగ పండించిన రైతుల వివరాలు సేకరించి... అధికారులే నేరుగా వారి నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లకముందు దళారీ వ్యాపారులు, ప్రైవేటు వ్యాపారులు వేరుశనగ రైతుల నుంచి కిలో రూ.50 రూపాయల నుంచి రూ.53 వరకు కొనేవారు. రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.61 వెచ్చించి కొనుగోలు చేయడంతో వేరుశనగ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీడ్స్ చిత్తూరు జిల్లా మేనేజర్ రెడ్డప్పరెడ్డి, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి ముమ్మరంగా వేరుశనగ విత్తన కాయల కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇదీ చదవండి: పంట పొలాలపై ఏనుగుల దాడులు...