ETV Bharat / state

లండన్​కు ఏపీ అధికారుల బృందం.. రస్ అల్ ఖైమా సంస్థతో చర్చలు! - (ap govt officials to visit london

ap govt officials to visit london
ap govt officials to visit london
author img

By

Published : Sep 22, 2021, 5:31 PM IST

Updated : Sep 22, 2021, 7:42 PM IST

17:26 September 22

ap govt officials to visit london

బాక్సైటు సరఫరా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై నమోదైన అంతర్జాతీయ స్థాయి వివాదం పరిష్కారాని(international dispute with ras al khaimah news)కి ఏపీ అధికారుల బృందం లండన్ వెళ్లనుంది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ(arbitration process)తో పాటు వివాదం పరిష్కరించుకునేందుకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వం(andhra pradesh department of mines and geology)లో అధికారుల బృందం లండన్ (ap govt officials to visit london) వెళ్లనుంది. గనుల శాఖ కార్యదర్శితో పాటు ఐజీ సీహెచ్ శ్రీకాంత్, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి తదితరులు లండన్ లో ఆర్బిట్రేషన్ ప్రక్రియకు హాజరుకానున్నారు.  

యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా సంస్థతో అంతర్జాతీయ వివాద పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఏపీ.. వివిధ అంశాలను ప్రస్తావించనుంది. సెప్టెంబరు 27 తేదీతో పాటు నవంబర్ 15న మరోమారు అంతర్జాతీయ అర్బిట్రేషన్ ప్రక్రియతో పాటు మధ్యవర్తిత్వం కోసం ఉన్నతాధికారులు లండన్ వెళ్లనున్నారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన అల్యూమినా ప్లాంటుకు బాక్సైట్ ముడి ఖనిజం అందివ్వాలని.. లేకుంటే నష్టపరిహరం చెల్లించాలని రస్ అల్ ఖైమా సంస్థ అంతర్జాతీయ స్థాయి అర్బిట్రేషనుకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించామని.. ముడి ఖనిజం సరఫరా సాధ్యం కాదని ఇప్పటికే రస్ అల్ ఖైమాకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయటంతో ఆ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియలో భాగంగా నష్టపరిహారంగా దాదాపు 600 కోట్ల రూపాయల మేర రస్ అల్ ఖైమాకు చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు ఒడిశా, ఛత్తీస్​ఘడ్ ల నుంచి బాక్సైటు ఖనిజాన్ని సరఫరా చేస్తే ఈ ఆర్బిట్రేషన్ నుంచి తప్పించుకోవచ్చని ఏపీ భావిస్తోంది.

ఇదీ చదవండి

CM Jagan: డిసెంబరు నుంచి గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన: సీఎం జగన్

Last Updated : Sep 22, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.