ETV Bharat / state

LOVE MARRIAGE: పెళ్లి.. ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి..

వారిద్దరి దేశాలు వేరైనా..ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. మూడేళ్లుగా సాగించిన వీరి ప్రేమాయణాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. హిందూ సాంప్రదాయం అంటే తనకెంతో గౌరవం అని చెప్పిన ప్రియురాలు ఇండియాలో పెళ్లి చేసుకునేందుకు ఖండాంతరాలు దాటి ప్రియుడు ఇంటికి వచ్చింది. పచ్చని పందిళ్లు, పసుపు బట్టలు, బొట్టు, చీరకట్టు, వేద మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీలు, గ్రామస్థుల సందడి మధ్య తన ప్రియునితో మూడు ముళ్లు వేయించుకుంది. ఈ పెళ్లి కార్యక్రమం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో జరిగింది.

andhra groom and america bride marriage
andhra groom and america bride marriage
author img

By

Published : Aug 26, 2021, 6:40 AM IST

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దేవలంపేట పంచాయతీ కుమ్మరిపల్లెకు చెందిన చీమలమర్రి నారాయణ కుమారుడు రంగయ్య ఇంజినీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసి సెంట్రల్ అమెరికాలోని మెక్సికోలో సోఫాస్ సోల్యూషన్స్​లో అసోసియేట్ మేనేజర్​గా పని చేస్తున్నాడు. సౌత్ అమెరికాలోని మేదిజిన్ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనమరియా కొలంబియాలోని ఎంప్లే ఆమోస్ కంపెనీలో కమర్షియల్ డైరెక్టర్​గా పని చేస్తుంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వారు ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. అయితే హిందూ సాంప్రదాయం అంటే ఎంతో గౌరవం ఉన్న ప్రియురాలు అనమరియ ఇండియాలో వివాహం చేసుకుంటానని తెలిపింది.

కరోనా కారణంగా ఇండియాకు వచ్చేందుకు తన ప్రియురాలి కుటుంబానికి అనుమతి లభించలేదు. అమెరికా నుంచి ఇండియాకు ప్రేమికులు ఇద్దరికి మాత్రమే ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు. దీంతో కుమ్మరిపల్లెలోని వరుడి ఇంటివద్ద గ్రామస్థుల మధ్య వైభవంగా వివాహం జరిగింది.

ఇదీ చదవండి: అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించాం: వెంకట్రామిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.