తిరుపతి రూరల్ మండలం పేరూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం, జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.తిరుపతి సింగాలగుంటకు చెందిన సరోజమ్మ(70) భర్త మునస్వామి నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి పేరూరులోని పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సరోజమ్మ మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని కుటంబ సభ్యులు తెలిపారు.సమాచారం అందుకున్న ఎం.ఆర్ పల్లి పోలీసులు శనివారం ఉదయం గజఈతగాళ్ళు సహాయంతో వెలికితీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: చెరువులో తేలిన విశ్రాంత ఏఎస్సై మృతదేహం