తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఓ ప్రైవేట్ లాడ్జిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య కలకలం రేపింది. శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగటంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరివారిపల్లె వాసులు చిన్నబ్బనాయుడు (73) రుక్మిణి (63)గా పోలీసులు గుర్తించారు. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 7 నుంచి స్విమ్స్‌లో చిన్నబ్బనాయుడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి