అమరావతి కోసం తిరుమల మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు రాజధానిపై అభిమానం చాటుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం తెలుగు యువత అధ్యక్షుడు డి. చౌదరి, పూజిత దంపతులు రాజధాని అమరావతిలోనే ఉండాలనే ఆకాంక్షతో అలిపిరి నడక మార్గంలో మోకాళ్ళపై ఎక్కుతూ కొండపైకి చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా కాపాడాలని కోరుకున్నారు.
ఇవీ చదవండి: ఏపీటీడీసీ బస్సు ఎక్కండి..వసతి, ఆతిథ్యం,దర్శనం పొందండి