యువతిపై పాస్టర్ అత్యాచారం చేశారని ఆరోపిస్తూ... ఆ నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితురాలికి న్యాయం చేయాలని తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్లో వీహెచ్పీ నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...ప్రేమంటూ తిరిగాడు... ఒప్పుకోలేదని చంపేశాడు...