వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మొదటగా కలకడ మండలంలోని కదిరాయ చెరువు, కోన గ్రామాలను సందర్శించారు. కరవు పరిస్థితుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పలు పథకాల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పనిముట్లను, పరికరాలను, సామాగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం గుర్రంకొండ మండలంలోని సరి మడుగు, మజ్జిగ వారి పల్లిలో పర్యటించి అక్కడి కరవు పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్న రైతులతో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వరి సాగును చేపట్టకూడదని, అదేవిధంగా ఎక్కువ లోతు బోర్లు డ్రిల్లింగ్ చేయవద్దని సూచించారు. తదుపరి పీలేరు మండలం వేపల బయలు పంచాయతీ దగ్గర రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వేరుశెనగ ప్రత్యామ్నాయంగా మిల్లెట్ సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని కోరారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని చిత్తూరు జిల్లాకు మళ్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :