చిత్తూరు జిల్లా సర్వే, రికార్డుల శాఖ సహాయ సంచాలకులు జలీల్ ఖాన్ మృతి చెందారు. గుండె పోటు రావడంతో ఆయనను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించారు. సెప్టెంబర్ నుంచి ఆయన ఏడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంతాపం తెలిపారు. గుడిపాల మండలం ముత్తుకూరు పల్లెలో జరిగిన భూ రక్ష పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జలీల్ ఖాన్ మృతికి ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్ భరత్ గుప్తా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఇదీ చదవండి :