చిత్తూరు జిల్లా తిరుపతిలో హత్యాయత్నం కేసులో 9 మంది ముద్దాయిలను, ఓ బాల నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది తిరుపతిలో సంచలనం రేపిన పసుపులేటి మురళీ కృష్ణ అలియాస్ బెల్ట్ మురళీ హత్య కేసులో ఏ-2గా ఉన్న మల్లికార్జున్.. అతనికి ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా పరిశీలించి సోమవారం ఉదయం అనుమానాస్పదంగా ఉన్న 9 మంది యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో మల్లికార్జున అనే వ్యక్తిని హత్య చేయాలని అనుకున్నామని నిందితులు చెప్పగా.. వారిని అరెస్టు చేశారు. వారి నుంచి ఓ కారు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదుచేసి రిమాండ్‌కి తరలించామని ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: